ఈ మొక్కను ముట్టుకుంటే..!

ABN , First Publish Date - 2021-07-01T05:44:43+05:30 IST

పొరపాటున ఆ చెట్టు ఆకులను తాకితే కొన్ని వారాల పాటు బాధతో విలవిల్లాడిపోతారు. ఆస్ట్రేలియాలో అత్యంత విషపూరితమైన మొక్కగా దీనికి పేరుంది. ‘జింపి జింపి’ అని పిలిచే ఆ మొక్క విశేషాలు ఇవి...

ఈ మొక్కను ముట్టుకుంటే..!

పొరపాటున ఆ చెట్టు ఆకులను తాకితే కొన్ని వారాల పాటు బాధతో విలవిల్లాడిపోతారు. ఆస్ట్రేలియాలో అత్యంత విషపూరితమైన మొక్కగా దీనికి పేరుంది. ‘జింపి జింపి’ అని పిలిచే ఆ మొక్క విశేషాలు ఇవి....


  1. ఆ మొక్క శాస్త్రీయ నామం డెండ్రోక్నైడ్‌ మొరాయిడ్స్‌. దీని ప్రత్యేకత ఏమిటంటే మెత్తగా, హార్ట్‌ షేపులో ఉండే ఆకులపై, కాండంపై చిన్నచిన్న సూదుల్లాంటి మొనదేలిన శిరోజాలుంటాయి. ఒక్కో ఆకుపై అలాంటి శిరోజాలు కొన్ని వేలు ఉంటాయి. ఇవి విషాన్ని కలిగి ఉంటాయి. ఆ విషం ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందంటే పొరపాటున గుచ్చుకుంటే నొప్పి కొన్ని వారాల పాటు ఉంటుంది.
  2. ఆకుపై ఉన్న సూదుల్లాంటి శిరోజాలు ఎంత సన్నగా ఉంటాయంటే చర్మంపై గుచ్చుకుంటే తీయడం చాలా కష్టం. ఎండిన ఆకులను ముట్టుకున్నా అంతే! అయితే ఈ మొక్కను కొన్ని కీటకాలు ఆహారంగా తినేస్తాయి. ఆస్ట్రేలియాలోని కేప్‌యార్క్‌ పెనిన్సులా, న్యూసౌత్‌వేల్స్‌ ఉత్తరప్రాంతంలోని అడవుల్లో ఈ మొక్క కనిపిస్తుంది. 

Updated Date - 2021-07-01T05:44:43+05:30 IST