డీజేలో స్టెప్పులేసిన బామ్మ.. ఇంత వయసులోనూ అంత సాహసమెందుకో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు..!

ABN , First Publish Date - 2021-09-29T15:35:43+05:30 IST

పిల్లలు అభివృద్ధి చెందుతుంటే వారి ఇంటిలోని...

డీజేలో స్టెప్పులేసిన బామ్మ.. ఇంత వయసులోనూ అంత సాహసమెందుకో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు..!

పిల్లలు అభివృద్ధి చెందుతుంటే వారి ఇంటిలోని పెద్దల ఆనందానికి అవధులుండవు. రాజస్థాన్‌లోని ఝుంఝును పరిధిలోని చార్వాసా గ్రామానికి చెందిన నిషా చాహర్ యూపీఎస్సీలో 117వ ర్యాంకు దక్కించుకుంది. ఈ విజయం సాధించడానికి ముందు నిషా చిన్నచూపునకు గురయ్యింది. నిషా పుట్టకముందు ఆమె బామ్మ తనకు మనవడు పుట్టాలని తపించిపోయింది. మనవరాలు పుట్టడంతో నిరాశపడిపోయింది. అయితే ఇప్పుడు మనవరాలు సాధించిన విజయంతో ఆమె ఆనందంతో చిందులేస్తోంది. 


ఈ సందర్భంగా నిషా చాహర్ బామ్మ నాన్చీదేవి మాట్లాడుతూ తన కుమారుడు రాజేంద్ర భార్య చంద్రకళ ఆడపిల్లకు జన్మనిచ్చినపుడు ఇంట్లో మౌనం తాండవించింది. ఎవరూ ఆనందపడలేదు. అయితే నా కుమారుడు మనుమరాలి చదువుసంధ్యల విషయంలో అమితమైన శ్రద్ధ చూపించాడు. నిషా బాల్యంలో ఎంతో అల్లరి చేసేదని తెలిపారు. యూపీఎస్సీ ఫలితాల్లో నిషాకు ర్యాంకు వచ్చిందని తెలియగానే బామ్మ తమ ఇంటిచుట్టుపక్కలవారందరికీ మిఠాయిలు పంచిపెట్టింది. డీజే మ్యూజిక్‌కు ఉత్సాహంగా చిందులేసింది. రాత్రంతా మేల్కొని అందరితో ఆనందంగా గడిపింది. నిషా తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజయం సాధించింది. బాల్యం నుంచి ఏ పరీక్షలోనూ అపజయం ఎరుగని నిషా సివిల్స్‌లోనూ తన ప్రతిభను చాటింది. ఈ సందర్బంగా నిషా తండ్రి రాజేంద్ర మాట్లాడుతూ తన కుమార్తెను ఐఎఎస్ చేయాలని తాము ఎన్నడూ కోరుకోలేదన్నారు. ఇంటర్‌లో బయాలజీ తీసుకున్న నిషా భవిష్యత్‌లో డాక్టర్ అవుతుందని అనుకున్నామన్నారు. సివిల్స్ విజేత నిషా మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలనుకున్నానని, ఇప్పుడు తన కల సాకారమయ్యిందని అన్నారు.

Updated Date - 2021-09-29T15:35:43+05:30 IST