ఇష్టపడ్డ ఇద్దరు యువతులను ఒకే వేదికపై పెళ్లాడిన యువకుడు.. ఇది ఎలా సాధ్యమైంది బ్రదర్ అంటున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2022-06-23T13:00:42+05:30 IST

ఒక యువతితో సహజీవనం చేస్తునే.. మరో యువతిని ప్రేమించాడు ఓ యువకుడు. అంతేకాకుండా ఇద్దరినీ ఓకే వేదికపై పెళ్లాడి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో ప్రస్తుతం ఆ వివాహం.. నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు

ఇష్టపడ్డ ఇద్దరు యువతులను ఒకే వేదికపై పెళ్లాడిన యువకుడు.. ఇది ఎలా సాధ్యమైంది బ్రదర్ అంటున్న నెటిజన్లు!

ఇంటర్నెట్ డెస్క్: ఒక యువతితో సహజీవనం చేస్తునే.. మరో యువతిని ప్రేమించాడు ఓ యువకుడు. అంతేకాకుండా ఇద్దరినీ ఓకే వేదికపై పెళ్లాడి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో ప్రస్తుతం ఆ వివాహం.. నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరు యువతులను పెళ్లికి ఎలా ఒప్పించావు బ్రదర్ అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. మరికొందరేమో.. ముందుంది ముసళ్ల పండుగ అంటూ ఎగతాళి చేస్తున్నారు. 


జార్ఖండ్‌లోని లోహర్దగా ప్రాంతానికి చెందిన సందీప్ ఒరాన్ అనే యువకుడు గత మూడేళ్లుగా కుసుమ్ లక్రా అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వాళ్లు ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చారు. కాగా.. కొద్ది రోజుల క్రితం సందీప్ ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాడు. అక్కడ ఇటుక బట్టీలో పని చేస్తుండగా.. అక్కడే పని చేస్తున్న స్వాతీ కుమారీ అనే యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఇటుక బట్టీలో పని ముగిసిన తర్వాత ఈ ఇద్దరూ రహస్యంగా కలుసుకునే వాళ్లు. కాగా.. సందీప్ వ్యవహారం బయటపడింది. సందీప్ ఏకకాలంతో ఇద్దరితో ప్రేమాయణం నడిపిస్తున్న విషయం.. యువతుల ఇళ్లలో తెలిసిపోయింది. 



దీంతో గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. వాదనలు విన్న తర్వాత పంచాయితీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు యువతులను సందీప్ పెళ్లి చేసుకోవాల్సిందే అని తీర్పు చెప్పారు. దీనికి యువతుల కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా సందీప్.. ఇద్దరు యువతులను ఒకే వేదిక వద్ద పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో.. నెటిజన్లు రియార్ట్ అవుతున్నారు. ‘పంచాయితీ పెద్దలు తీర్పిచ్చారు సరే.. ఈ పెళ్లికి ఆ ఇద్దరు యువతులు కూడా అభ్యంతరం చెప్పలేదా’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. సందీప్ మాత్రం..తనకు ఇద్దరూ ఇష్టమనీ.. వాళ్లను పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంటున్నాడు. 


Updated Date - 2022-06-23T13:00:42+05:30 IST