జార్ఖండ్ మరో మంత్రికి కరోనా..ఐసీయూకు తరలింపు

ABN , First Publish Date - 2020-09-29T14:34:47+05:30 IST

జార్ఖండ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగర్‌నాథ్ మహతోకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అతన్ని రాంచీ నగరంలోని రిమ్సు ఆసుపత్రిలో చేర్చారు....

జార్ఖండ్ మరో మంత్రికి కరోనా..ఐసీయూకు తరలింపు

రాంచీ (జార్ఖండ్): జార్ఖండ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగర్‌నాథ్ మహతోకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అతన్ని రాంచీ నగరంలోని రిమ్సు ఆసుపత్రిలో చేర్చారు. మంత్రి మహతోకు ఆక్సిజన్ లెవెల్ తగ్గడంతోపాటు శ్వాసకోశ సమస్యలు ఏర్పడటంతో అతన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించారు. ‘‘నాకు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో వచ్చింది...దీంతోనే చికిత్స చేయించుకునేందుకు రాంచీలోని రిమ్సు ఆసుపత్రిలో చేరాను’’అని మంత్రి మహతో ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా తనతో కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి మహతో కోరారు. 


జార్ఖండ్ రాష్ట్రంలో మహతోతో కలిసి నలుగురు మంత్రులకు కరోనా సోకింది. గతంలో మంత్రులు మిథిలేష్ ఠాకూర్, బన్నాగుప్తా, బాదల్ పత్రలేఖ్ లకు కరోనా సోకింది. జార్ఖండ్ రాష్ట్రంలో 79,909 మందికి కరోనా సోకగా వారిలో 679 మంది మరణించారు. 

Updated Date - 2020-09-29T14:34:47+05:30 IST