Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 15 Jan 2022 20:50:17 IST

నిన్న HEMA, నేడు KANGANA... నటీమణుల బుగ్గలపై నేతల నాటీ కామెంట్స్!

twitter-iconwatsapp-iconfb-icon
నిన్న HEMA, నేడు KANGANA... నటీమణుల బుగ్గలపై నేతల నాటీ కామెంట్స్!

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ ‘‘కంగనా బుగ్గల కంటే నున్నటి’’ రోడ్లు తాను వేయిస్తానని శపథం చేశాడు! ఆయన జార్ఖండ్‌లోని జమ్‌తారా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే, తానే స్వయంగా రికార్డ్ చేసుకున్న ఓ సెల్ఫీ వీడియోలో అన్సారీ కొత్త రోడ్ల గురించి ప్రస్తావించాడు. అదే క్రమంలో, సరికొత్త బాటలు ఎంత నున్నగా ఉంటాయంటే... కంగనా బుగ్గల కంటే బావుంటాయని ఆయన చెప్పుకొచ్చాడు! వాటిపై గిరిజనుల పిల్లలు, ఇతరులు కూడా హాయిగా ప్రయాణించవచ్చని వివరించాడు. త్వరలోనే 14 ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జమ్‌తారా నియోజక వర్గంలో మొదలవుతుందని డాక్టర్ గారు ప్రకటించారు!


ఎంబీబీఎస్ చదువుకున్న ఇర్ఫాన్ అన్సారీకి వివాదాలు కొత్తేం కాదు. ఆ మధ్య మాస్క్ అతిగా ధరించవద్దని ప్రకటించాడు. వైద్యుడిగా చెబుతున్నానని కూడా అన్నాడు. ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఆయన మాస్క్ ధరించలేదు. పైగా మాస్క్ మరీ అంత అవసరం లేదంటూ తనని తాను సమర్థించుకున్నాడు కూడా. 


కంగనా బుగ్గలతో రోడ్లని పోల్చిన జార్ఖండ్ ఎమ్మెల్యేకి... నిజానికి మహారాష్ట్ర నేత గులాబ్ రావ్ పాటిల్ ఇన్‌స్పిరేషన్ అని చెప్పాలి. గతంలో హేమామాలిని బుగ్గలతో తమ రోడ్లని పోల్చేసుకున్నాడు... ఈ శివసేన నాయకుడు! తరువాత సారీ కూడా చెప్పినప్పటికీ హీరోయిన్స్ అందాల్ని ప్రస్తావిస్తూ పొలిటీషన్స్ కామెంట్స్ చేయటం ట్రెండ్‌గా మారిందని మాత్రం చెప్పవచ్చు... 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...