సీఎం హేమంత్ సోరెన్‌కు కరోనా నెగెటివ్

ABN , First Publish Date - 2020-07-12T00:45:54+05:30 IST

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది.

సీఎం హేమంత్ సోరెన్‌కు కరోనా నెగెటివ్

జార్ఖండ్ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. శనివారం ఉదయం సీఎం హేమంత్, ఆయన భార్యతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఇతర సిబ్బంది  నమూనాలను కూడా వైద్యులు సేకరించారు. సిబ్బందికి కూడా నెగెటివ్ అని తేలింది. మంత్రి మిథిలేశ్ ఠాకూర్‌తో పాటు మరో ఎమ్మెల్యేతో సీఎం ఓ సారి సమావేశమయ్యారు. దీని తర్వాత ఆ మంత్రికి, ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సీఎం జూలై 8 నుంచి స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. 

Updated Date - 2020-07-12T00:45:54+05:30 IST