Advertisement
Advertisement
Abn logo
Advertisement

బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన ఓ మహిళకు షాకింగ్ అనుభవం.. రాత్రిపూట గదిలో నిద్రపోయి ఉదయంలేచి చూడగానే..

ఆమె బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లింది.. పెళ్లిలో వేసుకుందామని బంగారు నగలు తీసుకెళ్లింది.. వివాహం తర్వాత నగలు తీసి బ్యాగ్‌లో దాచి నిద్రపోయింది.. ఉదయం లేచి చూసేసరికి నగలు పెట్టిన పర్సు కనిపించకుండా  పోయింది.. దీంతో వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 


రాజస్థాన్‌లోని నాగౌర్‌కు చెందిన దీప్ కన్వర్ అనే మహిళ గురువారం సాయంత్రం తన బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లింది. రూ.5 లక్షలు విలువ చేసే బంగారు నగలు వేసుకుని వెళ్లింది. రాత్రి పెళ్లి అయిపోయిన తర్వాత నగలు తీసి పర్సులో పెట్టి.. ఆ పర్సును బ్యాగ్‌లో పెట్టుకుని నిద్రపోయింది. ఉదయం లేచి చూసే సరికి బ్యాగ్ కట్ అయి ఉంది. భయపడిన మహిళ బ్యాగ్ తెరిచి చూడగా నగలు ఉన్న పర్సు మిస్ అయింది. దీంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు.  

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement