ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశాలు.. జెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2021-11-07T16:36:58+05:30 IST

ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌..

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశాలు.. జెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ), కోల్‌కతాలోని సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ) ఉమ్మడిగా ‘జాయింట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (జెట్‌) 2021’ నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. దీని ద్వారా ఫిల్మ్‌, టెలివిజన్‌ విభాగాల్లో పీజీ డిప్లొమా, పీజీ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ టెస్ట్‌ను ఏ, బీ, సీ గ్రూప్‌ల వారీగా ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 27 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు ఒక్కో గ్రూప్‌ నుంచి ఒక కోర్సు చొప్పున గరిష్ఠంగా మూడు కోర్సులకు అప్లయ్‌ చేసుకోవచ్చు. టెస్ట్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా ఇంటర్వ్యూలు, మెడికల్‌ టెస్ట్‌ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. 


గ్రూప్‌ -  ఏ కోర్సులు (పీజీ డిప్లొమా)

- ప్రొడక్షన్‌ ఫర్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌, యానిమేషన్‌ సినిమా, ఆర్ట్‌ డైరెక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌, స్ర్కీన్‌ యాక్టింగ్‌, స్ర్కీన్‌ రైటింగ్‌ (ఫిల్మ్‌, టీవీ, వెబ్‌ సీరీస్‌), ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌.

- మొదటి మూడు కోర్సులకు ఒక్కోదాని వ్యవధి మూడేళ్లు. చివరి వాటికి ఒక్కోదాని వ్యవధి రెండేళ్లు. 

- మొదటి రెండు కోర్సులతోపాటు చివరిది ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐలో, మిగిలినవి ఎఫ్‌టీఐఐలో అందుబాటులో ఉన్నాయి. 


గ్రూప్‌ - బీ కోర్సులు (పీజీ డిప్లొమా)

- డైరెక్షన్‌ అండ్‌ స్ర్కీన్‌ ప్లే రైటింగ్‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ డిజైన్‌

- ఒక్కో కోర్సు వ్యవధి మూడేళ్లు. ఇవి రెండు ఇన్‌స్టిట్యూట్‌లలో అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు గ్రూప్‌ - ఏలోని ఆర్ట్‌ డైరెక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌, స్ర్కీన్‌ యాక్టింగ్‌ కోర్సులను  మాస్టర్స్‌ డిగ్రీకి సమానంగా ఏఐయూ గుర్తించింది. 


గ్రూప్‌ -  సీ కోర్సులు

పీజీ డిప్లొమా: ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌కు సంబంధించి డైరెక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, సౌండ్‌, రైటింగ్‌ కోర్సులు ఉన్నాయి. ఒక్కోదాని వ్యవధి రెండేళ్లు. ఇవి ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐలో అందుబాటులో ఉన్నాయి.

పీజీ సర్టిఫికెట్‌: డైరెక్షన్‌, ఎలక్ట్రానిక్‌ సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్‌, సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు ఉన్నాయి. ఒక్కోదాని వ్యవధి ఏడాది. ఇవి ఎఫ్‌టీఐఐలో అందుబాటులో ఉన్నాయి. వీటికి ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. 


అర్హత వివరాలు

ఆర్ట్‌ డైరెక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ కోర్సుకు డిగ్రీ (అప్లయిడ్‌ ఆర్ట్స్‌/ ఆర్కిటెక్చర్‌/ పెయింటింగ్‌/ స్కల్ప్చర్‌/ ఇంటీరియర్‌ డిజైన్‌)ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన కోర్సులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.   


జెట్‌ 2021 వివరాలు

ఇందులో రెండు పేపర్‌లు ఉంటాయి. పేపర్‌కు 50 మార్కులు నిర్దేశించారు. మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం 3 గంటలు. మొదటి పేపర్‌లో రెండు పార్ట్‌లు ఉంటాయి. మొదటి పార్ట్‌లో ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ, అలైడ్‌ ఆర్ట్స్‌, లిటరేచర్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ నాలెడ్జ్‌ (ఆర్ట్‌, కల్చర్‌, మీడియా)అంశాలకు సంబంధించి 20 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. రెండో పార్ట్‌లో అభ్యర్థి ఎంచుకొన్న కోర్సుకు సంబంధించి 15 మల్టిపుల్‌ సెలెక్ట్‌ ప్రశ్నలు అడుగుతారు. వీటికి ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉంటాయి. ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.  నాలుగు సమాధానాలు ఉన్నపుడు మూడింటిని మాత్రమే గుర్తిస్తే 1.5, మూడు సమాధానాలు ఉన్నపుడు రెంటిని గుర్తిస్తే 1, రెండు లేదా అంతకన్నా ఎక్కువ సమాధానాలు ఉన్నపుడు ఒకదాన్ని మాత్రమే గుర్తిస్తే 0.5 మార్కులు ఇస్తారు.


సమాధానాలను ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. రెండు పార్ట్‌లలో తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. కోర్సును అనుసరించి రెండో పేపర్‌ ఉంటుంది. ఇది స్పెషలైజేషన్‌కు సంబంధించిన ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌. ఇందులో ఒక లాంగ్‌ డిస్ర్కిప్టివ్‌ క్వశ్చన్‌ ఇస్తారు. దీనికి 20 మార్కులు ప్రత్యేకించారు. ఇది తప్పనిసరి ప్రశ్న. దీనితోపాటు స్కెచ్‌, ఫొటోగ్రాఫ్స్‌ తదితరాలకు సంబంధించి డిస్ర్కిప్టివ్‌, షార్ట్‌నోట్‌ ప్రశ్నలు ఆరింటిని అడుగుతారు. వీటిలో మూడింటికి సమాధానాలు రాయాలి. ఒక్కోదానికి 10 మార్కులు ఉంటాయి.


ముఖ్య సమాచారం

జెట్‌ 2021 వ్యాలిడిటీ: 2022 సెప్టెంబరు 30 వరకు

దరఖాస్తు ఫీజు: ఒక కోర్సుకు రూ.2,000(రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు రూ.600); రెండు కోర్సులకు రూ.3000(రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు రూ.900); మూడు కోర్సులకు రూ.4,000(రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు రూ. రూ.1200)

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 2

అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడింగ్‌: డిసెంబరు 8 నుంచి 17 వరకు

గ్రూప్‌ - ఏ ఎగ్జామ్‌ తేదీ: డిసెంబరు 18

గ్రూప్‌ - బీ, గ్రూప్‌ - సీ ఎగ్జామ్స్‌ తేదీ: డిసెంబరు 19

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌

వెబ్‌సైట్‌: ftii.ac.insrfti.ac.in


Updated Date - 2021-11-07T16:36:58+05:30 IST