జెట్ ఎయిర్‌వేస్: జలాన్-కల్రాక్ కన్సార్టియం... నియామకాలను ప్రకటన

ABN , First Publish Date - 2022-05-23T21:39:44+05:30 IST

జెట్ ఎయిర్‌వేస్: జలాన్-కల్రాక్ కన్సార్టియం... నియామకాలను ప్రకటన

జెట్ ఎయిర్‌వేస్: జలాన్-కల్రాక్ కన్సార్టియం...   నియామకాలను ప్రకటన

* జులైలో పునప్రారంభం కానున్న సంస్థ కార్యకలాపాలు 

న్యూఢిల్లీ : జెట్ ఎయిర్‌వేస్ నిధులు, కొత్త యాజమాన్యం సహా కొత్త నిర్వహణతో రావడానికి... జలాన్-కల్రాక్ కన్సార్టియం నేతృత్వంలో సిద్ధమవుతోంది. జెట్ ఎయిర్‌వేస్... విమానాలను పునప్రారంభించనున్న విషయం తెలిసిందే. జెట్ ఎయిర్‌వేస్‌ను నడుపుతున్న జలాన్-కల్రాక్ కన్సార్టియం, నాయకత్వ బృందం కోసం పలు కొత్త నియామకాలను ప్రకటించింది. ప్రభ్ శరణ్ సింగ్‌ను చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా, హెచ్‌ఆర్ జగన్నాథ్ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా, మార్క్ టర్నర్ ఇన్‌ఫ్లైట్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్‌గా, విశేష్ ఖన్నాను సేల్స్, డిస్ట్రిబ్యూషన్/కస్టమర్ ఎంగేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకటించింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ మాట్లాడుతూ, “జెట్ ఎయిర్‌వేస్ యొక్క సీనియర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లోని తాము...  ఉమ్మడిగా విధులను నిర్వహించనున్నామని, వాటిలో ముఖ్యమైనది జెట్‌ను అధిక సంఖ్యలో వినియోగదారులు, ప్రయాణికులు ఇష్టపడేలా,  పునర్నిర్మించాలన్న తమ ఉమ్మడి ఉద్దేశ్యమని పేర్కొన్నారు. 


వచ్చే నెల(జూన్) ఒకటిన చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సింగ్.. ఐటీ, డిజిటల్ విభాగానికి నాయకత్వం వహిస్తారు. సింగ్ ప్రస్తుతం WNS గ్లోబల్ సర్వీసెస్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్/డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో సుదీర్ఘకాలం నాయకత్వ బాధ్యతలను నిర్వహించారు. ఎతిహాద్ ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేశారు కూడా. ఇక... జగన్నాథ్ ఈ రోజు(మే 23, సోమవారం) ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన... ఎయిర్‌లైన్స్ ఇంజినీరింగ్/మెయింటెనెన్స్ బృందానికి నాయకత్వం వహిస్తారు. ఈయనకు... 40 సంవత్సరాలకు పైగా విమానయాన అనుభవముండడంతో పాటు ఇటీవల ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కూడా  పనిచేశారు. భారతదేశంలో ఎయిర్ ఇండియాకు సంబంధించి MRO సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా... VVIP కార్యకలాపాల కోసం భారత వైమానిక దళానికి ప్రత్యేకంగా కాన్ఫిగర్ అయిన బోయింగ్ 777 విమానాలను డెలివరీ చేయడానికి నాయకత్వం వహించడం విశేషం. 


కాగా... జూన్ 15 న ఇన్‌ఫ్లైట్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్‌గా టర్నర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. బర్నర్... 2008-2011 మధ్య జెట్ ఎయిర్‌వేస్ ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్ టీమ్‌కు నాయకత్వం వహించారు. టర్నర్‌కు గల్ఫ్ ఎయిర్, ఎమిరేట్స్‌లో కీలకమైన సీనియర్ మేనేజ్‌మెంట్ పదవులతో పాటు 40 సంవత్సరాలకు పైగా విమానయాన అనుభవం కూడా ఉంది. , ఖతార్, ఫిజీ ఎయిర్‌వేస్ ల్లో... ఈయన క్యాబిన్ సిబ్బంది కార్యకలాపాలు, శిక్షణ, ఇన్‌ఫ్లైట్ ఉత్పత్తి అభివృద్ధి, క్యాటరింగ్‌ను పర్యవేక్షించనున్నారు. 


మరో అధికారి ఖన్నా జూలై 2022 లో సేల్స్, డిస్ట్రిబ్యూషన్, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన  ప్రస్తుతం VFS గ్లోబల్ లిమిటెడ్‌లో ఈ-వీసా బిజినెస్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు దాదాపు 30 సంవత్సరాల అనుభవముంది. ఈయన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో కార్పొరేట్ సేల్స్ VPగా, ఇండిగోలో కార్పొరేట్ సేల్స్ ఇండియా VPగా కూడా పనిచేశాడు.



దీనికి ముందు, కన్సార్టియం సీఈఓగా సంజీవ్ కపూర్‌ను, CFOగా విపుల గుణతిల్లేక, ఫ్లైట్ ఆపరేషన్స్, అకౌంటబుల్ మేనేజర్‌గా కెప్టెన్ PP సింగ్, ఎయిర్‌పోర్ట్స్ & ఎయిర్‌పోర్ట్ ట్రైనింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా అల్ఫోన్సో దాస్, హ్యూమన్ రిసోర్సెస్ వైస్ ప్రెసిడెంట్‌గా నకుల్ తుతేజాను నియమించారు. 


గత వారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) నుండి ఎయిర్‌లైన్ తన ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్(AOC) పొందిన విషయం తెలిసిందే. కగా... జులై-సెప్టెంబరు త్రైమాసికంలో జెట్ తన కార్యకలాపాలను పునఃప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - 2022-05-23T21:39:44+05:30 IST