జైలులో సత్ప్రవర్తన.. విడుదలైన జెస్సికా లాక్ హత్యకేసు దోషి

ABN , First Publish Date - 2020-06-02T23:14:20+05:30 IST

మోడల్ జెస్సికా లాల్ హత్యకేసు దోషి మనుశర్మ సోమవారం జైలు నుంచి విడుదలయ్యాడు. తీహార్ జైలులో 14

జైలులో సత్ప్రవర్తన.. విడుదలైన జెస్సికా లాక్ హత్యకేసు దోషి

న్యూఢిల్లీ: మోడల్ జెస్సికా లాల్ హత్యకేసు దోషి మనుశర్మ సోమవారం జైలు నుంచి విడుదలయ్యాడు. తీహార్ జైలులో 14 ఏళ్ల జైలు శిక్ష అనంతరం ‘సత్ప్రవర్తన’ కారణంతో అతడిని విడుదల చేశారు.  1999లో ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో జెస్సికా లాల్ హత్య జరిగింది. ఈ కేసులో దోషిగా తేలిన మనుశర్మకు కోర్టు జీవిత శిక్ష విధించింది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన శిక్ష సమీక్ష బోర్డు మనుశర్మను ముందే విడుదల చేయాల్సిందిగా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అంగీకరించారు. అలాగే, ఢిల్లీ బోర్డు ప్రతిపాదించిన మరో 18 మంది దోషుల విడుదలకు కూడా బైజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  


జెస్సికా లాల్ దోషి మను శర్మ గత రెండేళ్లుగా ఓపెన్ జైలులో ఉంటున్నాడు. ఉదయాన్నే జైలు కాంప్లెక్స్ నుంచి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్నాడు. మనుశర్మగా అందరికీ తెలిసిన సిద్ధార్థ వశిష్ట  కేంద్ర మాజీ మంత్రి వినోద్  శర్మ కుమారుడు. జెస్సికా లాల్ హత్యకేసులో దోషిగా తేలిన అతడికి ఢిల్లీ హైకోర్టు డిసెంబరు 2006లో జైలు శిక్ష విధించింది.


ట్రయల్ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించినప్పటికీ హైకోర్టు ఆ తీర్పును కొట్టివేసి జీవిత ఖైదు విధించింది. ఏప్రిల్ 2010లో సుప్రీకోర్టు ఈ తీర్పును సమర్థించింది. 30 ఏప్రిల్ 1999న రాత్రి దక్షిణ ఢిల్లీలోని టేమరిండ్ కోర్టు రెస్టారెంట్‌లో తనకు మద్యాన్ని సరఫరా చేసేందుకు నిరాకరించిన జెస్సికా లాల్‌ను మనుశర్మ కాల్చి చంపాడు.  


Updated Date - 2020-06-02T23:14:20+05:30 IST