ఉపాధి పనులను పరిశీలించిన జేసీ

ABN , First Publish Date - 2021-09-29T05:41:01+05:30 IST

మండలంలోని కొనకొండ్ల గ్రామంలో మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత కుమార్‌ ఉపాధి పనులను పరిశీలించారు.

ఉపాధి పనులను పరిశీలించిన జేసీ
నీటికుంటను పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత కుమార్‌

వజ్రకరూరు, సెప్టెంబరు 28: మండలంలోని కొనకొండ్ల గ్రామంలో మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత కుమార్‌ ఉపాధి పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడు తూ ఈనెల 30న గ్రామంలోని ఉపాధి పనులను కేంద్ర బృందం పరిశీలించనుందన్నారు. రికార్డుల్లోని ప్రతి పని క్షేత్రస్థాయిలో కనిపించాలన్నారు. పనులకు సంబంధించిన రికార్డులను అందుబాటులో ఉంచాలన్నారు. బృందం సభ్యులు గ్రామంలో ఉపాధి కింద చేపట్టిన  ఏపని గురించి అడిగినా చూపించేలా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీ విజయలక్ష్మి, ఈసీ ప్రభాకర్‌, సీఓ సురేష్‌, ఎస్‌ఏ గోవిందు, చుక్కారాజు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-29T05:41:01+05:30 IST