Abn logo
Sep 21 2021 @ 00:32AM

గ్రామ రెవెన్యూ అధికారుల గైర్హాజరుపై జేసీ ఆగ్రహం

పామిడి సచివాలయంలో లబ్ధిదారుల జాబితా పరిశీలిస్తున్న జేసీ డాక్టర్‌ సిరి

పామిడి, సెప్టెంబరు 20: గ్రామ సచివాలయాల్లో విధులకు గ్రామ రె వెన్యూ అధికారులు గైర్హాజరు కావడంపై జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి ఆ గ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె పట్టణంలోని 2, 7వ గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ రెవె న్యూ అధికారులు ఎక్కడా? అని ఆరా తీశారు. సెలవులో ఉన్నారని తెలియజేయడంతో... లీవ్‌ లెటర్‌ ఏది? అని జేసీ అడిగారు. లీవ్‌ లెటర్‌ కూడా ఇ వ్వకుండా విధులకు రాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. వీఆర్వో లు సక్రమంగా సచివాలయాలలో అందుబాటులో ఉండడం లేదని అసహ నం వ్యక్తంచేశారు. వీఆర్వోలకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని ఆర్డీఓ మధుసూదనను ఆదేశించారు. గ్రామ సచివాలయాలలో ప్రభుత్వ పథకాల పోస్టర్లను సక్రమంగా అతికించాలన్నారు. సచివాలయ సిబ్బంది క్రమం తప్పకుండా బయోమెట్రిక్‌ వేయాలని సూచించారు. వలంటీర్ల బయోమెట్రిక్‌ అ ధ్వానంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.


ఆర్‌బీకేను తనిఖీ చేసిన కమిషనరేట్‌ బృందం

పామిడి మండలం గజరాంపల్లి రైతు భరోసా కేంద్రాన్ని సోమవారం గుం టూరు కమిషనరేట్‌ కార్యాలయం ఆర్‌బీకే తనిఖీ బృందం ఆకస్మికంగా పరిశీలించింది. ఏడీఏ గోపాల్‌, ఏఓ శివశంకర్‌రెడ్డి, ఏడీఏ(పీపీ) విద్యావతి, టీఏ ఓ వంశీకృష్ణ ఆర్‌బీకే పనితీరుపై ఆరా తీశారు. ఆర్‌బీకేల ద్వారా అందజేస్తు న్న నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందు పంపిణీపై రైతులను అడిగి తెలుసుకున్నారు. పొలంబడి, తోటబడి కార్యక్రమాల నిర్వహణపై వీ ఏఏ ధరణిని అడిగారు. ప్రభుత్వ పథకాలను రైతులకు చేరవేయాల్సిన బా ఽధ్యత ఆర్‌బీకేలపై ఉందని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి లీనా వసుంధర, ఏఈఓ శ్రీనివాసులు, రైతులు పాల్గొన్నారు.