శరీర ఉష్ణోగ్రతలపై రాక్షసబల్లుల స్వీయ నియంత్రణ

ABN , First Publish Date - 2020-02-18T09:06:39+05:30 IST

రాక్షస బల్లులు.. అదేనండీ డైనోసార్స్‌పై పరిశోధనలు జరుగుతున్న కొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా వాటి శరీరంలో

శరీర ఉష్ణోగ్రతలపై రాక్షసబల్లుల స్వీయ నియంత్రణ

జెరూసలెం, ఫిబ్రవరి 17 : రాక్షస బల్లులు.. అదేనండీ డైనోసార్స్‌పై పరిశోధనలు జరుగుతున్న కొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా వాటి శరీరంలో శీతల రక్తం ప్రవహించేదా? ఉష్ణ రక్తమా? అనే అంశంపై అధ్యయనం జరిగింది. ఇందుకోసం కెనడాలో లభ్యమైన 7.5 కోట్ల ఏళ్ల కిందటి డైనోసార్ల గుడ్ల పెంకులపై ఇజ్రాయెల్‌లోని హిబ్రూ వర్సిటీ, అమెరికాలోని యేల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్త పరిశోధనలు జరిపారు. క్లంప్స్‌డ్‌ ఐసోటోప్‌ పాలియోథర్మోమెట్రీ పద్ధతిలో ఆ గుడ్ల పెంకుల్లోని రసాయన బంధాలేమిటి? వాటి గుణస్వభావాలు ఏమిటి? అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలా సేకరించిన సమాచారం ఆధారంగా ఆ గుడ్డు పెట్టిన రాక్షసబల్లి శరీర ఉష్ణోగ్రత సగటున 35-40 డిగ్రీల సెల్సీయస్‌ ఉండేదనే అంచనాకు వచ్చారు. దీన్నిబట్టి డైనోసార్లు ఎప్పటికప్పుడు శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించుకొని ఉండొచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

Updated Date - 2020-02-18T09:06:39+05:30 IST