జెర్సీ, బెడ్‌ నెంబర్‌ 18

ABN , First Publish Date - 2022-09-23T09:57:21+05:30 IST

భారత దిగ్గజ క్రికెట్‌ క్రీడాకారుడు, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వీరాభి మానికి లక్కీ నెంబర్‌ దక్కింది.

జెర్సీ, బెడ్‌ నెంబర్‌ 18

కోహ్లీ వీరాభిమానికి లక్కీనెంబర్‌

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): భారత దిగ్గజ క్రికెట్‌ క్రీడాకారుడు, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వీరాభి మానికి లక్కీ నెంబర్‌ దక్కింది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌ పురస్కరించుకొని నగరానికి చెందిన ఓ మహిళ టికెట్ల కోసం గురువారం జింఖానా గ్రౌండ్‌కు వెళ్ళింది. అయితే తొక్కిసలాటలో కిందపడిన ఆమె స్పృహ కోల్పోయింది. గమనించిన పోలీసులు ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం సదరు మహిళకు 18వ నెంబర్‌ బెడ్‌ కేటాయించారు. విరాట్‌ కోహ్లీ జెర్సీ నెంబర్‌ కూడా 18 కావడం విశేషం. కోహ్లీ అభిమాని కావడంతోనే తనకు 18వ నెంబర్‌ బెడ్‌ దక్కిందనే సంతోషాన్ని ట్విట్టర్‌ ద్వారా వ్యక్తపరిచింది.

Updated Date - 2022-09-23T09:57:21+05:30 IST