Jeremy Lalrinnunga: వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం.. స్వర్ణం సాధించిన జెరెమీ

ABN , First Publish Date - 2022-07-31T21:55:09+05:30 IST

కామన్వెల్త్ గేమ్స్‌ (commonwealth games) వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. స్టార్ వెయిట్‌లిఫ్ట

Jeremy Lalrinnunga: వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం.. స్వర్ణం సాధించిన జెరెమీ

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌ (commonwealth games) వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. స్టార్ వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లల్‌రిన్నుంగా(Jeremy Lalrinnunga) 67 కేజీల విభాగంలో స్వర్ణం సాధించి భారత్‌కు రెండో స్వర్ణం అందించాడు. మొత్తంగా ఇది ఐదో పతకం. మొత్తంగా 300 కేజీలు ఎత్తిన జెరెమీ సరికొత్త రికార్డు లిఖించాడు.


19 ఏళ్ల జెరెమీ కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. స్నాచ్‌లో 140 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 160 కేజీలు ఎత్తి మొత్తంగా 300 కేజీలతో సరికొత్త రికార్డును తన పేర రాసుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణ పతకం కాగా ఓవరాల్‌గా ఐదో పతకం. మహిళల విభాగంలో మణిపురి క్వీన్ మీరాబాయి చాను (mirabai chanu) 49 కేజీల విభాగంలో శనివారం భారత్‌కు తొలి పసిడి పతకం అందించింది.


 కామన్వెల్త్ గేమ్స్ మూడో రోజు భారత్‌కు ఇదే తొలి పతకం. రెండోరోజైన శనివారం భారత ఏకంగా నాలుగు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. కాగా, 2018లో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో జెరెమీ బంగారు పతకం సాధించాడు. ఏషియన్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో మోకాలికి గాయం కావడంతో ఒలింపిక్స్‌లో పాల్గొనలేకపోయాడు. 


భారత లిఫ్టర్లు సంకేత్ సర్గర్ (sanket sargar), బింద్యారాణి దేవి(bindyarani devi) రజత పతకాలు సాధించగా, గురురాజ పుజారి (gururaja poojary) కాంస్యంతో మెరిశాడు. దీంతో కామన్వెల్త్‌లో భారత్ ఇప్పటి వరకు సాధించిన పతకాల సంఖ్య ఐదుకు పెరిగింది. పతకాల పట్టికలో భారత్ 8వ స్థానంలో ఉండగా, 13 స్వర్ణాలు సహా 32 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.



Updated Date - 2022-07-31T21:55:09+05:30 IST