-
-
Home » NRI » America Nagarallo » Jennifer Lopez Alex Rodriguez call off their engagement
-
అలెక్స్ రోడిగ్రెజ్కు బ్రేకప్ చెప్పిన జెన్నీఫర్ లోపేజ్!
ABN , First Publish Date - 2021-03-13T23:03:07+05:30 IST
అమెరికాకు చెందిన ప్రముఖ నటి, సింగర్ జెన్నీఫర్ లోపేజ్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానిపట్ల స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. వివరాల్లోకి వె
మియామి: అమెరికాకు చెందిన ప్రముఖ నటి, సింగర్ జెన్నీఫర్ లోపేజ్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానిపట్ల స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జెన్నీఫర్ లోపేజ్ (51), ప్రముఖ మాజీ క్రీడాకారుడు అలెక్స్ రోడ్రిగెజ్ (45).. రెండేళ్లపాటు డేటింగ్లో ఉన్న తర్వాత 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. 40మిలియన్ డాలర్లతో మియామీలో ఈ జంట ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది. కరోనా నేపథ్యంలో వీరు తమ పెళ్లిని రెండు సార్లు వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. కాగా.. వీరు తమ ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నట్టు యూఎస్ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్తలను జెన్నీఫర్ లోపేజ్ కానీ.. అలెక్స్ కానీ ఇంత వరకు ధ్రువీకరించలేదు. ఇదిలా ఉంటే.. వీరిద్దరి బ్రేకప్‌పై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ‘ఈ రోజు నవ్వుకోవడానికి ఓ కారణం దొరికింది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా.. గతంలో కూడా ఇటివంటి వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి.