2014లో జరిగిన ఓ సంఘటన హాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేసింది. ఎందుకంటే ఆ ఏడు అందాల భామలైన రిహన్నా, సెలెనా గోమేజ్, జెన్నీఫర్ లారెన్స్ న్యూడ్ ఫోటోలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. ఎవరో హ్యాకర్స్ వాటిని ఇంటర్నెట్లో పెట్టారు.
ఈ ఘటనపై తాజాగా ‘ది హంగర్ గేమ్స్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వూలో మాట్లాడింది జెన్నీఫర్. ఈ బ్యూటీ మాట్లాడుతూ..‘నా న్యూడ్ బాడీని ఎవరైనా, ఎప్పుడైనా నా పర్మిషన్ లేకుండా చూడొచ్చు. ఫ్రాన్స్‌లోని ఎవరో వాటిని ప్రచురించారు. ఈ గాయం నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంద’ని తెలిపింది.అంతేకాకుండా 2017లో జరిగిన ఓ ఫ్లైట్ ఇంజిన్ ఫెయిల్ అవ్వడం ఆమెను ఎంతో బలహానురాలిని చేసిందని ఈ భామ చెప్పింది. అలాంటి భయకరమైన అనుభవం ఉన్నప్పటకీ ప్రొపెషన్లో భాగంగా ఫ్లైట్ జర్నీ చేయక తప్పదని, అలా చేసినప్పడల్లా అందరం చనిపోక తప్పదు, తన గురించి బాధపడొద్దని మనసులోనే కుటుంబానికి చెబుతుంటుందని ఈ భామ పేర్కొంది.
అయితే జెన్నీఫర్ ప్రస్తుతం ‘టైటానిక్’ స్టార్ లియోనార్డో డికాప్రియోతో కలిసి ‘డోంట్ లుక్ అప్టూ దట్’ అనే పొలిటికల్ డ్రామా మూవీలో నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా స్క్రీనింగ్‌లో భాగంగా లాస్ ఎంజెల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎత్తైన పొట్ట (బెబీ బంప్) కనిపించింది. దీంతో ఈ బ్యూటీకి, తన భర్త కూక్ మరోనీకి త్వరలోనే సంతానం కలగనుందని అందరూ అనుకుంటున్నారు.