జెల్లల పులుసు

ABN , First Publish Date - 2020-06-06T18:13:56+05:30 IST

జెల్లలు - ఒకకేజీ, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - నాలుగు, చింతపండు రసం - ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, గరంమసాలా - ఒక టీస్పూన్‌, మెంతిపొడి - అరటీస్పూన్‌,

జెల్లల పులుసు

కావలసినవి: జెల్లలు - ఒకకేజీ, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - నాలుగు, చింతపండు రసం - ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, గరంమసాలా - ఒక టీస్పూన్‌, మెంతిపొడి - అరటీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, జీలకర్ర - అరటీస్పూన్‌, ఉప్పు - తగినంత, ఎండుమిర్చి - రెండు, కొత్తిమీర - కొద్దిగా. కొబ్బరి తురుము - ఒక టేబుల్‌స్పూన్‌,  టొమాటో ప్యూరీ - ఒక కప్పు.


తయారీ: ఉల్లిపాయను మంటపై పెట్టి కాసేపు ఉడికించి, తరువాత మెత్తగా పేస్టు చేయాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్టు, పసుపు వేసి మరికాసేపు వేగించాలి. తరువాత టొమాటో ప్యూరీ వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు చింతపండు రసం పోయాలి. తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. కారం, గరంమసాలా, మెంతిపొడి, కొబ్బరి తురుము, తగినంత ఉప్పు వేయాలి. మిశ్రమం ఉడుకుతున్న సమయంలో శుభ్రం చేసి పెట్టుకున్న జెల్లలు వేయాలి. మరో పదినిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-06-06T18:13:56+05:30 IST