బెజోస్‌ బంపర్‌ సేల్‌

ABN , First Publish Date - 2020-08-07T06:40:27+05:30 IST

అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్‌ బెజోస్‌.. కంపెనీలో తన వాటాకు చెందిన 310 కోట్ల డాలర్ల విలువైన షేర్లు విక్రయించాడు. గత ఏడాది మొత్తానికి విక్రయించిన 280 కోట్ల డాలర్ల విలువైన షేర్ల కంటే అధికం...

బెజోస్‌ బంపర్‌ సేల్‌

  • అమెజాన్‌లో 310 కోట్ల డాలర్ల షేర్లు విక్రయించిన సీఈఓ 


అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్‌ బెజోస్‌.. కంపెనీలో తన వాటాకు చెందిన 310 కోట్ల డాలర్ల విలువైన షేర్లు విక్రయించాడు. గత ఏడాది మొత్తానికి విక్రయించిన 280 కోట్ల డాలర్ల విలువైన షేర్ల కంటే అధికం. తాజా స్టేక్‌ సేల్‌తో కలిపి ఆయన ఈ ఏడాదిలో విక్రయించిన మొత్తం షేర్ల విలువ 720 కోట్ల డాలర్లకు చేరుకుంది. అయినప్పటికీ బెజోస్‌ చేతిలో ఇంకా 5.4 కోట్లకు పైగా షేర్లు ఉన్నాయి. వాటి ప్రస్తుత మార్కెట్‌ విలువ 17,300 కోట్ల డాలర్లు.

Updated Date - 2020-08-07T06:40:27+05:30 IST