టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడుగా జీవీ

ABN , First Publish Date - 2022-01-27T05:27:27+05:30 IST

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఎట్టకేలకు భర్తీ చేసింది. 2018 నుంచి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పార్టీ జిల్లా అధ్యక్ష పదవి శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) చైర్మన్‌ జీవి రామకృష్ణారావును వరించింది.

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడుగా జీవీ
జీవీ రామకృష్ణారావు

 - క్రీయాశీలత, విధేయతకు పట్టం

- టీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధిలో పాత్ర 


కరీంనగర్‌ టౌన్‌, జనవరి 26: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఎట్టకేలకు భర్తీ చేసింది. 2018 నుంచి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న  పార్టీ జిల్లా అధ్యక్ష పదవి శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా)  చైర్మన్‌ జీవి రామకృష్ణారావును వరించింది. దీనిపై బుధవారం పార్టీ అధినేత అధికారిక ప్రకటన చేశారు. కొంత కాలంగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవి పెండింగ్‌ పడుతూ వస్తోంది. అధిష్టానానికి విధేయుడు, పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీల  పాత్ర పోషించిన జీవీపైనే పార్టీ నాయకత్వం మొగ్గు చూపింది. మానకొండూర్‌ మండలానికి చెందిన జీవీ జిల్లాలో పార్టీ అభివృద్ధికి చురుకైన పాత్ర పోషించారు.  ఏ బాధ్యత అప్పగించినా పాటించడం ఆయనకు కలిసి వచ్చిన అంశాలుగా పలువురు పేర్కొంటున్నారు. కరీంనగనర్‌ మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ జీవి నియామకం పట్ల సానుకూలంగా ఉండ టంతో అధిష్టానం ఆయనకే మొగ్గు చూపింది.  ఈ పదవికి జిల్లాలోని పలువురు నేతలు పోటీ పడినా సౌమ్యుడు, న్యాయవాది తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉండ డంతో నాయకత్వం ఆయననే ఖరారు చేసింది. ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు సమీప బంధువు, ఉద్యమ తొలినాళ్ల నుంచి క్రియాశీల పాత్ర పోషిస్తూ కార్యకర్తలను సమన్వయ పరుస్తూ జీవీ పార్టీ కోసం పనిచేశారు. గత సంవత్సరం ప్లీనరీ సమావేశాల అనంతరం జిల్లా కమిటీలు ప్రకటిస్తారని అంతా భావించినా, వరుస ఎన్నికలు, ఉప ఎన్నికలు, కరోనా పరిస్థితుల దృష్ట్యా సంస్థాగత నియామకాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కరీంనగర్‌లో జిల్లా అధ్యక్ష పదవికి పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ఎమ్మెల్యేల తర్వాత పార్టీ పదవుల్లో నాయకులు లేకపోయారు. రెండు సంవత్సరాలుగా కరోనా పరిస్థితుల దృష్ట్యా పార్టీ కమిటీల నియమకాలు చేపట్టలేదు. ఇక పూర్తి స్థాయిలో జిల్లా కమిటీలు ప్రకటిస్తే పార్టీ కమిటీలు పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో పనిచేయడానికి వీలు ఉంటుంది.  మండ ల స్థాయి, జిల్లా స్థాయిలో కమిటీల నియామకాలు పూర్తయితే టీఆర్‌ఎస్‌ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లనున్నాయి.

Updated Date - 2022-01-27T05:27:27+05:30 IST