అర్వింద్‌పై జీవన్‌రెడ్డి ఆగ్రహం

ABN , First Publish Date - 2021-09-05T22:01:37+05:30 IST

ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అర్వింద్‌పై జీవన్‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్: ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘అర్వింద్‌కు దమ్ముంటే ఆర్మూర్ నుంచి నాపై పోటీ చేయాలి. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి గోడలు కూల్చివేస్తాననడం సిగ్గుచేటు. ప్రజలు ఎంపీని గెలిపించింది అభివృద్ధి కోసం.. పీఎస్‌ను కూలగొట్టడానికి కాదు. పసుపు బోర్డు తెస్తానని మాట తప్పిన ఫేక్‌ ఎంపీ అర్వింద్‌. సీఎం కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి’’ జీవన్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2021-09-05T22:01:37+05:30 IST