జగిత్యాల: ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి విమర్శలు సంధించారు. షుగర్ ఫ్యాక్టరీ మూసివేయించినందుకే కవిత ఓడిపోయారని తెలిపారు. కాంగ్రెస్-బీజేపీ మ్యాచ్ఫిక్సింగని కవిత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు బీజేపీతో టీఆర్ఎస్ కుమ్మక్కైంది నిజం కాదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు సిద్ధాంతం అనేది ఉందా అని జీవన్‌రెడ్డి నిలదీశారు.