మంత్రి మల్లారెడ్డికి యూనివర్సిటీ ఎలా వచ్చింది?: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-18T19:53:56+05:30 IST

కేజీ టూ పీజీ విద్య ఏమైందని సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిలదీశారు. నేడు ఆయన మీడియాతో..

మంత్రి మల్లారెడ్డికి యూనివర్సిటీ ఎలా వచ్చింది?: జీవన్‌రెడ్డి

జగిత్యాల : కేజీ టూ పీజీ విద్య ఏమైందని సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిలదీశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డికి యూనివర్సిటీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలకు ప్రయివేటు కాలేజీలు ఎక్కడివని నిలదీశారు. 317 జీవోను వెంటనే రద్దు చేసి భార్యాభర్తలను ఒకే చోట చేర్చాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-18T19:53:56+05:30 IST