ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2021-12-27T16:29:47+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు

జగిత్యాల జిల్లా: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎర్రవెల్లి రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లాగా వ్యవహరిస్తున్నాయన్నారు. 150 ఎకరాల్లో సీఎం కేసీఆర్ ఎలా వరి సాగు చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఒక నీతి.. రైతులకో నీతా అని జీవన్ రెడ్డి నిలదీశారు.

Updated Date - 2021-12-27T16:29:47+05:30 IST