Abn logo
Sep 27 2021 @ 11:13AM

బీజేపీ, కేసీఆర్ ఇద్దరు ఒక్కటే.. షర్మిల వ్యాఖ్యలు అర్థ రహితం: జీవన్ రెడ్డి

హైదరాబాద్: బీజేపీ, కేసీఆర్ ఇద్దరు ఒక్కటేనని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలంటే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టం మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 


ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి జుట్టు రాహుల్ గాంధీ చేతిలో... కేసీఆర్ చేతిలో రేవంత్ పిలక ఉంటుందని షర్మిల చేసిన వ్యాఖ్యలు అర్థ రహితమన్నారు. నిన్న మొన్న పార్టీ పెట్టిన వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడల్సిన అవసరం లేదన్నారు. ఆమె ఎం మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావడం లేదన్నారు. షర్మిల మాటలను తాము పెద్దగా పరిగణనలోకి తీసుకొమన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఆమె ఆరోపణలను చూశాక స్పందిస్తానన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...