జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-24T06:07:27+05:30 IST

ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, జీఎ్‌ఫఐటీ, ఎన్‌ఐటీలలో ఇంజనీరింగ్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్‌ తొలివిడత ఆన్‌లైన్‌ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి.

జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం

జిల్లాలో 6,180 మంది హాజరు


నెల్లూరు (విద్య) జూన్‌ 23 : ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, జీఎ్‌ఫఐటీ, ఎన్‌ఐటీలలో ఇంజనీరింగ్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్‌ తొలివిడత ఆన్‌లైన్‌ పరీక్షలు  గురువారం ప్రారంభమయ్యాయి. 29వ తేదీ వరకు ఉదయ, మధ్నాహ్నం రెండు బ్యాచ్‌లుగా జరిగే ఈ పరీక్షలకు జిల్లాలో 6,180 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పర్యవేక్షణలో టీసీఎస్‌ జిల్లాలోని 4 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. విద్యార్థులకు హాల్‌టికెట్లతోపాటు పరీక్ష కేంద్రంలో పాటించాల్సిన నియమ, నిబంధనలతో కూడిన నియమావళిని అందచేశారు. సరిగ్గా 9 గంటలకు పరీక్ష ప్రారంభమైన తరువాత మధ్నాహ్నం 12 గంటలకు ఆటోమోటిక్‌గా ఆప్షన్ల ప్రక్రియ ముగుస్తుంది. మధ్నాహ్నం జరిగే పరీక్ష కూడా ఇదే విధంగా గంటన్నర ముందు నుంచి విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. నెల్లూరులో నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాల, గూడూరులో ఆదిశంకర ఇంజనీరింగ్‌ కళాశాల, రాజుపాళెం శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల, బుచ్చి గీతాంజలి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.  రెండో విడత మెయిన్‌ పరీక్షలు జులై 21 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. 


  ఒకటి నుంచి అంగన్‌వాడీల్లో భోజనం

ఇందుకూరుపేట, జూన్‌ 23: జూలై ఒకటో తేదీ నుంచి గర్భిణులకు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే భోజనం  అందజేయనున్నట్లు ఇందుకూరుపేట ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సీడీపీవో హేనాసుజన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌తో  రెండేళ్లుగా గర్భిణులకు, బాలింతలకు ఇంటి వద్ద కే రేషన్‌ ఇచ్చామని, తిరిగి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే గర్భిణు లకు, బాలింతలకు భోజనాలు  వడ్డిస్తామని  వివరించారు. భోజనంతోపాటు ఐరన్‌, కాల్షీయం మాత్రలు, ఉడక పెట్టిన గుడ్లు, పాలు కూడా అందజేస్తామన్నారు. ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలు సమయానికి కేంద్రానికి రావాలన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు కేంద్రంలో తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రీ స్కూల్‌ హాజరు పెరిగేలా కృషి చేయాలని, వంట చేసే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.  

Updated Date - 2022-06-24T06:07:27+05:30 IST