Bihar political crisis: రాజీనామా చేసి నేరుగా రబ్రీదేవి ఇంటికి చేరిన నితీశ్

ABN , First Publish Date - 2022-08-09T21:55:54+05:30 IST

పాట్నా: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక నితీశ్ కుమార్ నేరుగా మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకురాలు రబ్రీదేవి ఇంటికి చేరారు.

Bihar political crisis: రాజీనామా చేసి నేరుగా రబ్రీదేవి ఇంటికి చేరిన నితీశ్

పాట్నా: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక నితీశ్ కుమార్ నేరుగా మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకురాలు రబ్రీదేవి ఇంటికి చేరారు. ఇప్పటికే రబ్రీ నివాసానికి ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ-ఎంఎల్ ఎమ్మెల్యేలు, నేతలు చేరుకున్నారు. జేడియూ, ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ-ఎంఎల్‌తో కలిసి నితీశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 122 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఈ కూటమి వద్ద ఉన్నారు. 


243 మంది సభ్యులున్న బీహార్ శాసనసభలో ఆర్జేడీకి 80, బీజేపీకి 77, జేడియూకు 45, కాంగ్రెస్‌కు 19, వామపక్షాలకు 16 మంది ఎమ్మెల్యేలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. 


సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేశాక కొంతకాలం నితీశ్ సీఎంగా, డిప్యూటీ సీఎంగా తేజస్వీ కొనసాగుతారు. 2024 ఎన్నికల సమయానికి విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగాలని నితీశ్ యోచిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నితీశ్ విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగితే 2025 వరకూ తేజస్వీ యాదవ్ బీహార్ సీఎంగా కొనసాగుతారు. 

Updated Date - 2022-08-09T21:55:54+05:30 IST