ఆర్‌బీకేను పరిశీలించిన జేడీఏ

ABN , First Publish Date - 2021-06-18T05:15:08+05:30 IST

నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ గురువారం పరిశీలించారు.

ఆర్‌బీకేను పరిశీలించిన జేడీఏ
ఆర్‌బీకేను పరిశీలిస్తున్న జేడీఏ ఉమామహేశ్వరమ్మ

నంద్యాల, జూన్‌ 17: నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ గురువారం పరిశీలించారు. జూలై 8న నిర్వహించే వైఎ్‌సఆర్‌ రైతు దినోత్సవం రోజున రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా క్షేత్ర స్థాయిలో రైతులకు అన్ని రకాల పంటల సాగు, సస్యరక్షణ, పంటల సాగుపై సలహాలు, సూచనలు, నాణ్యమైన విత్తనాలు, సస్యరక్షణకు సంబంధించి సవివరంగా తెలియజేసేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. డీడీఏ బోస్‌, ఏడీఏ రాజశేఖర్‌, ఏవో ఆయూబ్‌బాష, ఏఈవో మణిమోహన్‌రెడ్డి, వీఏఏ మాధురి పాల్గొన్నారు.


రుద్రవరం: సచివాలయాల భవనాల నిర్మాణంలో నాణ్యత పాటించాలని వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఉమామహేశ్వరమ్మ అన్నారు. గురువారం మండలంలోని ఆలమూరు, చిత్రేణిపల్లె గ్రామాల్లో సచివాలయ భవనాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. భవన నిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా సచివాలయ భవనాలను పరిశీలించారు. ఆమె వెంట ఈవోపీఆర్డీ రామకృష్ణవేణి, ఏవో ప్రసాదురావు, ఏపీవో ప్రతాప్‌, పీఆర్‌ ఏఈ వెంకట్రాముడు, కార్యదర్శి పాములేటి ఉన్నారు. 



Updated Date - 2021-06-18T05:15:08+05:30 IST