33 మండలాల రైతులకు పంట నష్ట పరిహారం

ABN , First Publish Date - 2020-12-05T06:41:05+05:30 IST

పంట నష్టపరిహారాన్ని 33 మండలాల రైతులకు అందించేందుకు నివేదికలు తయారు చేస్తున్నామని జేడీఏ రామకృష్ణ తెలిపారు. కణేకల్లులోని వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రంలో సాగు చేసిన వరి పంటను శుక్రవారం ఆయన పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు.

33 మండలాల రైతులకు పంట నష్ట పరిహారం
సమావేశంలో మాట్లాడుతున్న జేడీఏ

33 మండలాల రైతులకు 

పంట నష్ట పరిహారం

వివరాలను సిద్ధం చేస్తున్నాం: జేడీఏ

రాయదుర్గం, డిసెంబరు 4: పంట నష్టపరిహారాన్ని 33 మండలాల రైతులకు అందించేందుకు నివేదికలు తయారు చేస్తున్నామని జేడీఏ రామకృష్ణ తెలిపారు. కణేకల్లులోని వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రంలో సాగు చేసిన వరి పంటను శుక్రవారం ఆయన పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. నాణ్యమైన వరి విత్తనాలను రాష్ట్ర నలుమూలలకు అందించటం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధిక వర్షాలతో ఈ ఏడాది రైతులు సాగు చేసిన వేరుశనగ పంట ఎకరాకు రెండు, మూడు బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చిందన్నారు. ఇటీవల నిర్వహించిన పంటకోత ప్రయోగాల్లో మండలాన్ని యూనిట్‌గా తీసుకుని, దిగుబడిని అంచనా వేయగా 33 మండలాల్లో హెక్టారకు 455 కిలోలలోపు వచ్చిందన్నారు. మిగిలిన 30 మండలాల్లో దీనికంటే ఎక్కువ దిగుబడి వచ్చిందన్నారు. దీంతో దిగుబడి తక్కువ నమోదైన మండలాల్లో పంట నష్ట పరిహారం జాబితాను సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 16 లక్షల ఎకరాల్లో ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేశామన్నారు. 2018కి సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.953 కోట్లు త్వరలోనే రైతులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. అందుకు ఇప్పటికే అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేస్తున్నామన్నారు. నివర్‌ తుఫాను కారణంగా 2400 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయన్నారు. 2200 ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటలు దెబ్బతిన్నాయన్నారు. 33 శాతం కన్నా అధికంగా పంట దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రత్యేక యాప్‌ ద్వారా పంట నష్టపోయిన రైతుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు జేడీఏ తెలిపారు.


Updated Date - 2020-12-05T06:41:05+05:30 IST