విత్తనాలను అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు

ABN , First Publish Date - 2021-05-16T05:57:32+05:30 IST

హైబ్రిడ్‌ మిర్చి విత్తనాలను ఎక్కువ ధరలకు అమ్మే వ్యాపారులపైకఠినచర్యలు తీసుకొంటామని వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి హెచ్చరించారు.

విత్తనాలను అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు

జేడీ విజయభారతి హెచ్చరిక



గుంటూరు, మే 15 (ఆంధ్రజ్యోతి): హైబ్రిడ్‌ మిర్చి విత్తనాలను ఎక్కువ ధరలకు అమ్మే వ్యాపారులపైకఠినచర్యలు తీసుకొంటామని వ్యవసాయ శాఖ  జేడీ విజయభారతి హెచ్చరించారు. ఆంధ్రజ్యోతిలో ఈనెల 13న సాగుకుసై.... శాంపిల్స్‌ నై ! అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఆమె శనివారం విత్తన డీలర్లు, వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆర్మూర్‌ హైబ్రిడ్‌ మిర్చి విత్తనాలను ఆర్‌బీకేలకు ఇవ్వాలన్నారు. నర్సరీ యజమానులు జిల్లాలోని రైతులకు మాత్రమే మిరప మొక్కలు అమ్మాలన్నారు. సమావేశంలో ఆగ్రోస్‌ డీఎం వాణిశ్రీ, ఉద్యానవనశాఖ ఏడీ రాజాకృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ డీడీ రామాంజనేయులు, ఏడీ హేమలత, ఏవో గౌతమ్‌ప్రసన్న, పలువురు డీలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-16T05:57:32+05:30 IST