Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంకా రెండేళ్ళ సమయం వుంది కదా?: జేడీ లక్ష్మీనారాయణ

అమరావతి: 2019ఎన్నికల ముగిసిన దగ్గర నుంచి జనంలోనే వున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాజకీయ ఆహ్వానాలు ఎన్నికల ముందు వస్తాయని, ఇంకా రెండేళ్ళ సమయం వుందన్నారు. 2024నాటికి ఎటువంటి పిలుపులు వస్తాయో చూద్దామన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే రాజకీయమన్నారు. ఆవేశాలు, విభేదాలను ఆసరాగా తీసుకుని ఓట్లను వేయించుకుంటున్నారని మండిపడ్డారు. అవగాహన వున్నప్పుడే ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళను ప్రశ్నించగలుగుతామన్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించడమే తాను చేస్తున్న రాజకీయమన్నారు. 

Advertisement
Advertisement