Abn logo
Sep 28 2021 @ 22:51PM

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవ చేయాలి : జేసీ

సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న జేసీ

కావలి రూరల్‌, సెప్టెంబరు 28: ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ గణే్‌షకుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని సర్వాయపాలెం, ఆనెమడుగు, రుద్రకోట, చెన్నాయపాలెం సచివాలయాలను మంగళవారం ఆయన అకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోని వారిని గుర్తించి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ వేయించాలని ఏఎన్‌ఎంలను ఆదేశించారు. ఈ సర్వీ్‌సలకు సంబంధించిన చలానా మొత్తం వెంటనే ప్రభుత్వ నిధులకు జమ చెయ్యాలని డిజిటల్‌ అసిస్టెంట్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్పీడీవో సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది, సర్పంచులు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.