Abn logo
Oct 16 2021 @ 23:44PM

బుచ్చిలో జేసీ గణేష్‌కుమార్‌ సుడిగాలి పర్యటన

దామరమడుగు సచివాలయాన్ని పరిశీలిస్తున్న జేసీ గణేష్‌కుమార్‌.

బుచ్చిరెడ్డిపాళెం,అక్టోబరు16: బుచ్చిరెడ్డిపాళెం మండలంలో శనివారం జేసీ గణేష్‌కుమార్‌ సుడిగాలి పర్యటన చేశారు. దామరమడుగు, రేబాల, కాళయకాగొల్లు గ్రామాల్లోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో నరసింహరావు, పంచాయతీ సెక్రటరీలు రామ్మోహన్‌రావు, సచివాలయ సిబ్బంది  ఉన్నారు.