అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-06T05:32:53+05:30 IST

తుని, డిసెంబరు 5: తుని మున్సిపాల్టీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా జాయింట్‌ కలెకర్‌ జి.రాజకుమారి ఆదేశించారు. శనివారం తునిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా జేసీ మా ట్లాడుతూ 14వ ఆర్థికసంఘం నిధులు

అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలి
తునిలో పనులు పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి

జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి

తుని, డిసెంబరు 5: తుని మున్సిపాల్టీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా జాయింట్‌ కలెకర్‌ జి.రాజకుమారి ఆదేశించారు. శనివారం తునిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా జేసీ మా ట్లాడుతూ 14వ ఆర్థికసంఘం నిధులు రూ.1.15 కోట్లతో జరుగుతున్న సిమెంట్‌ రోడ్లు, డ్రైన్లు పనుల్లో నాణ్యత ఉండాలని సూచించారు. పట్టణంలో గృహాల నుంచి తడి, పొడి చెత్త సేకరణ కార్యక్రమాన్ని, నాడు-నేడు పనులను తనిఖీ చేశారు. అనంతరం ఇసుకలపేటలోని సచివాలయం 10ను సందర్శించి, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న తీరును ఆమె సమీక్షించారు. మున్సిపల్‌ కార్యాయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పారిశుధ్యం, తాగునీటి సరఫరా, సీజనల్‌ వ్యాధుల నివారణ, పన్నుల సేకరణ, పౌర సేవలు మున్సిపల్‌ ఆస్తుల అభివృద్ధి, పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ బీజేఎస్‌ ప్రసాద్‌రాజు, డీఈ కనకారావు, శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:32:53+05:30 IST