ఫీవర్‌ సర్వే పక్కాగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-05-17T05:51:23+05:30 IST

గ్రామాల్లో నిర్వహిస్తున్న కొవిడ్‌-19 ఫీవర్‌ సర్వే పక్కాగా నిర్వహించాలని జేసీ ప్రశాంతి ఆదేశించారు. మండలంలోని యడ్లపాడు, తిమ్మాపురం గ్రామాలలో జరుగుతున్న ఫీవర్‌ సర్వేను జేసీ ఆదివారం పరిశీలించారు.

ఫీవర్‌ సర్వే పక్కాగా నిర్వహించాలి
తిమ్మాపురంలో ఫీవర్‌ సర్వేను పరిశీలిస్తున్న జేసీ ప్రశాంతి

యడ్లపాడు, మే 16: గ్రామాల్లో నిర్వహిస్తున్న కొవిడ్‌-19 ఫీవర్‌ సర్వే పక్కాగా నిర్వహించాలని జేసీ ప్రశాంతి ఆదేశించారు. మండలంలోని యడ్లపాడు, తిమ్మాపురం గ్రామాలలో జరుగుతున్న ఫీవర్‌ సర్వేను జేసీ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయి సిబ్బందికి ఫీవర్‌ సర్వేపై సరైన అవగాహన లేదని, వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుంటే వారికి వెంటనే ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ వస్తే మెడికల్‌ కిట్‌ అందజేయాలన్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారిని వెంటనే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు లేదా హాస్పిటల్‌కు తరలించాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో మాధురి, తహసీల్దారు శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - 2021-05-17T05:51:23+05:30 IST