అనంతపురం జిల్లా: రెండేళ్ల తర్వాత తిరుమలకు వెళ్తే భక్తులకు ఇన్ని అవస్థలా? అంటూ తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరుమలలో భక్తుల అవస్థలపై స్పందించిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో వైవీ సుబ్బారెడ్డి వచ్చాక భక్తులకు దైవదర్శనం కరువైందన్నారు. ఏదో మంచి చేస్తారని అధికారం ఇచ్చిన ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తేనే ఏపీలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. పవన్ రైతు భరోసా చేపట్టగానే బాధితులకు ప్రభుత్వం పరిహారం అందించిందన్నారు. పవన్ తాడిపత్రి పట్టణానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమస్యలపై పవన్ పోరాడాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు.
ఇవి కూడా చదవండి