జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరును ఖండించిన పోలీసుల సంఘం

ABN , First Publish Date - 2020-08-07T22:27:18+05:30 IST

పోలీసులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి దురుసు ప్రవర్తనను పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె.శ్రీనివాసరావు ఖండించారు. పోలీసులపై దౌర్జన్యం చేసిన జేసీ

జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరును ఖండించిన పోలీసుల సంఘం

అమరావతి: పోలీసులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి దురుసు ప్రవర్తనను పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె.శ్రీనివాసరావు ఖండించారు. పోలీసులపై దౌర్జన్యం చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో భాగంగా సజ్జలదిండి వద్ద ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వర్తిస్తున్న తాడిపత్రి రూరల్ సీఐ దేవేంద్రను జేసీ ప్రభాకర్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషించారన్నారు. సీఐ వీధులకు ఆటంకం కలిగించడంతో పాటు అతన్ని బెదిరించడాన్ని పోలీసుల అధికారుల రాష్ట్ర సంఘం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. మాజీ శాసన సభ్యులు అయి ఉండి ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి ఇటువంటి దౌర్జన్యాలకు పూనుకోవడం అత్యంత శోచనీయమని పేర్కొన్నారు.



Updated Date - 2020-08-07T22:27:18+05:30 IST