26న రైతుల ఖాతాల్లో నగదు జమ : జేసీ

ABN , First Publish Date - 2020-05-24T07:58:40+05:30 IST

జిల్లాలో ఇప్పటి వరకు రూ.645.49 కోట్ల విలువైన 3.52 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ..

26న రైతుల ఖాతాల్లో నగదు జమ : జేసీ

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : జిల్లాలో ఇప్పటి వరకు రూ.645.49 కోట్ల విలువైన 3.52 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జేసీ కె.మాధవీలత తెలిపారు. ఈ నెల 26వ తేదీన రైతుల ఖాతాల్లో నగదు  జమచేస్తామన్నారు. డయల్‌ యువర్‌ జాయింట్‌ కలెక్టర్‌  విజయవాడ క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగింది. ఉంగుటూరు, చందర్లపాడు,  మోపిదేవి, విజయవాడ రూరల్‌, పెనుమలూరు తదితర మండలాలకు చెందిన పలువురు రైతులు ధాన్యం కొనుగోలులో ఎదుర్కొంటున్న  ఇబ్బందులను వివరించారు. 2231 రకం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లకు ఆదేశాలిచ్చామని జేసీ తెలిపారు. పౌరసరాఫరాల జిల్లా మేనేజరు రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-24T07:58:40+05:30 IST