మాతా,శిశు భవనం పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-06-20T05:09:04+05:30 IST

జీజీహెచ్‌ (కాకినాడ), జూన్‌ 19: జీజీహెచ్‌లో మాతా,శిశు విభాగ భవనం అసంపూర్తి నిర్మాణ పనులను సత్వరంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయించాలని జేసీ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్‌)లో జాతీయ

మాతా,శిశు భవనం పూర్తి చేయాలి
భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న జేసీ కీర్తి, అధికారులు

జేసీ కీర్తి చేకూరి

జీజీహెచ్‌లో నిర్మాణ పనుల పరిశీలన

జీజీహెచ్‌ (కాకినాడ), జూన్‌ 19: జీజీహెచ్‌లో మాతా,శిశు విభాగ భవనం అసంపూర్తి నిర్మాణ పనులను సత్వరంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయించాలని జేసీ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్‌)లో జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) నిధులతో నిర్మాణంలో ఉన్న మాతా,శిశు బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులను అసిస్టెంట్‌ కలెక్టర్‌, కొవిడ్‌ ప్రత్యేక నోడల్‌ అధికారి సూర్యప్రవీణ్‌చంద్‌తో కలసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ భవనం అందుబాటులోకి గైనిక్‌, పీడియాట్రిక్‌ విభాగాలన్నీ రావడంతో గర్భిణులు, చిన్నారులకు వైద్యులు మరింత మెరుగైన వైద్యసేవలు అందించవచ్చన్నారు. నాలుగేళ్లు పైగా నిర్మాణం కొనసాగటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకట్రెండు నెలల్లో భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్‌, మొదటి అంతస్తు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల జాప్యంపై అధికారులు, కాంట్రాక్టర్లను వివరణ కోరగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పనులు ముందుకుసాగడం లేదని బదులిచ్చారు. తక్షణమే పెండింగ్‌ బిల్లుల తాలుకా సమాచారం సిద్ధం చేసి తనకు అందివ్వాలని, బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని జేసీ హామీ ఇచ్చారు. భవనంలో ఏర్పాటు చేయాల్సిన వసతులు, పరికరాలపై చర్చించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.మహాలక్ష్మి, డీసీఆర్‌ఎంవో డాక్టర్‌ అనిత, ఆర్‌ఎంవో డా.గిరిధర్‌, అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-20T05:09:04+05:30 IST