సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతున్న జేసీ విదేహ్ ఖరే
దొరవారిసత్రం, జనవరి 17 : దొరవారిసత్రం మండలం తల్లంపాడు గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ (గృహనిర్మాణ శాఖ) విదేహ్ ఖరే సోమవారం సందర్శించారు. ఉద్యోగుల పనితీరుపై ఆరా తీశారు. ఓటిఎస్ లక్ష్యాలను వంద శాతం సాధించడంతోపాటు, జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయించాలని సచివాలయ సిబ్బంది, మండల అధికారులకు సూచించారు. గృహనిర్మాణ శాఖ అధికారులతోపాటు తహసీల్దారు రాఘవేంద్రరావు, ఎంపీడీవో సింగయ్య పాల్గొన్నారు.