ప్రజలకు సంతృప్తి కలిగేలా సేవలందించడి

ABN , First Publish Date - 2022-05-19T03:23:53+05:30 IST

ప్రజలకు సంతృప్తి కలిగేలా ప్రభుత్వ సేవలు ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ అన్నారు.

ప్రజలకు సంతృప్తి కలిగేలా సేవలందించడి
సమీక్షలో మాట్లాడుతున్న జేసీ హరేందిర ప్రసాద్‌

జేసీ హరేందిర ప్రసాద్‌

నెల్లూరు(హరనాథపురం), మే 18 : ప్రజలకు సంతృప్తి కలిగేలా ప్రభుత్వ సేవలు ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ అన్నారు. తిక్కన భవన్‌లో బుధవారం మండల, డివిజన్‌స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ స్పందన పోర్టల్‌, మీసేవ, ఏపీసేవ పోర్టల్‌లో ప్రతిరోజూ వచ్చే సర్వీసు రిక్వెస్టులను పరిశీలించి సంబంధిత వివరాలు నమోదు చేయాలన్నారు. జనగనన్న హౌసింగ్‌ కాలనీల్లో నిర్మాణం వేగవంతం చేయాలని, ప్రారంభం కాని ఇళ్లను సత్వరమే ప్రారంభించాలన్నారు.  పారిశుధ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. శానిటేషన్‌ కాంప్లెక్సు నిర్మాణాలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల భవన నిర్మాణాలను గడువు లోగా పూర్తి చేయాలన్నారు. ఓటీఎస్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్‌, స్కానింగ్‌, డిజిటల్‌ సిగ్నేచర్‌ పక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూముల రీసర్వే వేగవంతంగా జగాలన్నారు. ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలన్నారు. అమృత్‌ సరోవర్‌ పథకం కింద గుర్తించిన చెరువుల పనులకు చర్యలు చేపట్టాలన్నారు. సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు ఖచ్చితంగా ప్రజలకు అందేలా చూడాలని ఆదేశించారు. ఈనెల 22 నాటికి మండలాల వారీగా చుక్కల భూముల సమస్యలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో వాణి, డీపీవో ధనలక్ష్మి, డ్వామా డీఆర్‌డీఏ పీడీలు తిరుపతయ్య, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-19T03:23:53+05:30 IST