Abn logo
Sep 24 2021 @ 22:42PM

అందరికీ వ్యాక్సిన్‌ వేయాలి : జేసీ

సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ గణేశ్‌

బిట్రగుంట, సెప్టెంబరు 24: మండలంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్‌ వేయాలని, అందుకు ఇంటింటి సర్వే నిర్వహించాలని జేసీ గణేశ్‌ అన్నారు. బోగోలు పంచాయతీ చెంచులక్ష్మీపురంలోని సచివాలయాని శుక్రవారం ఆయన తనిఖీ చేసి సచివాలయ సిబ్బందిని వ్యాక్సినేషన్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై కోవూరుపల్లి వైద్యాధికారి సీమాతబుసం మాట్లాడుతు మండలంలో 23 వేల 728 మందికి వ్యాక్సిన్‌ వేయాల్సి ఉండగా మొదటి విడత 22,619 మందికి, రెండో విడత 8వేల 142 మందికి వ్యాక్సిన్‌ వేశామన్నారు. స్థానికులు, మండల స్థాయి అధికారుల సహకారంతో 95.3 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని తెలిపారు. వలస కార్మికులు, మృతి చెందిన వారి విషయం, రేషన్‌ కార్డుల్లో పేర్లు నమోదుపై వీఆర్వో బాలనరసింహాని వివరాలు అడిగారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఇబ్బంది, ఆరోగ్య శాఖ, రెవెన్యూ స్థానికులు ఉన్నారు.