ఓటీఎస్‌ వేగవంతం చేయాలి : జేసీ

ABN , First Publish Date - 2022-01-26T03:39:24+05:30 IST

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు పేదలకు పూర్తి స్థాయిలో వర్తింపచేయడంతోపాటు, ఓటీఎస్‌ను వేగవంతం చేయాలని డెవలప్‌మెంట్‌ విభాగం జేసీ గణేష్‌కుమార్‌ సచివాలయ సిబ్బందికి సూచించారు.

ఓటీఎస్‌ వేగవంతం చేయాలి : జేసీ
పోలంపాడు సచివాలయాన్ని తనిఖీ చేస్తున్న జేసీ గణేష్‌ కుమార్‌

కలిగిరి, జనవరి 25: ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు పేదలకు పూర్తి స్థాయిలో వర్తింపచేయడంతోపాటు, ఓటీఎస్‌ను వేగవంతం చేయాలని డెవలప్‌మెంట్‌ విభాగం జేసీ గణేష్‌కుమార్‌ సచివాలయ సిబ్బందికి సూచించారు. మంగళవారం కలిగిరి, పోలంపాడు, పెదకొండూరు, నాగసముద్రం సచివాలయాలను జేసీ సందర్శించారు. స్పందన వినతుల రిజిష్టరును పరిశీలించారు. ప్రజా సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాల పట్ల అజాగ్రత్త వహించవద్దని, కరోనా లక్షణాలు కలిగిన వారిపట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రావులకొల్లు సర్పంచు పూసాల వెంగపనాయుడు తమ పంచాయతీ పరిధి నుంచి చిన అన్నలూరు వెళ్లే మార్గంలో రోడ్డు ప్రక్కన 1050 మొక్కలు నాటి బిల్లులు చేసుకున్నారనే విషయాన్ని జేసీ దృష్టికి తీసుకురాగా, ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-26T03:39:24+05:30 IST