25న ఓటర్ల దినోత్సవం

ABN , First Publish Date - 2022-01-19T06:08:25+05:30 IST

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ నెల 25న జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు.

25న ఓటర్ల దినోత్సవం
కలెక్టరేట్‌లో సమీక్షిన్న జేసీ దినేష్‌కుమార్‌

ఘనంగా నిర్వహించాలని జేసీ ఆదేశాలు 

గుంటూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ నెల 25న జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో జేసీ ప్రసంగించారు. ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో నిర్వహించే కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ఎన్‌జీవోలు తప్పక పాల్గొనేలా చూడాలన్నారు. కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్‌ కార్డులు అందించాలని సూచించారు. 26న దేశ గణతంత్ర దినోత్సవాన్ని కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలన్నారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సంబంధించి స్టాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జేసీ(ఆసర) కే శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో పీ కొండయ్య, స్పెషల్‌ కలెక్టర్‌ వినాయకం, జడ్పీ సీఈవో శ్రీనివాసరెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జే యాస్మిన్‌, ఎస్‌ఎస్‌ఏ అదనపు పీవో వెంకటప్పయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T06:08:25+05:30 IST