రైస్‌మిల్లర్లు సార్టెక్స్‌ పరికరాలు అమర్చుకోవాలి

ABN , First Publish Date - 2021-07-30T06:32:26+05:30 IST

రైస్‌మిల్లర్లు తమ మిల్లులో ఫోర్టిఫికేషన్‌, సార్టెక్స్‌ పరికరాలను అమర్చుకోవాలని జేసీ దినేష్‌కుమార్‌ తెలిపారు.

రైస్‌మిల్లర్లు సార్టెక్స్‌ పరికరాలు అమర్చుకోవాలి
రైస్‌మిల్లర్ల సమావేశంలో పాల్గొన్న జేసీ దినేష్‌కుమార్‌

గుంటూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రైస్‌మిల్లర్లు తమ మిల్లులో ఫోర్టిఫికేషన్‌, సార్టెక్స్‌ పరికరాలను అమర్చుకోవాలని జేసీ దినేష్‌కుమార్‌ తెలిపారు. గురువారం  కలెక్టరేట్‌లో ఆయన రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రబీ 2020-21 సీజన్‌కి సంబంధించి మిల్లులు ఇంకా ఇవ్వాల్సిన బియ్యాన్ని ఆగస్టు 10 కల్లా కార్పొరేషన్‌కి స్వాధీనం చేయాలన్నారు. రైతులంతా ఈ-క్రాప్‌లో నమోదు కావాల్సిందిగా రైస్‌మిల్లర్లు అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం గోతాలను రైతులకు మిల్లర్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ జయంతి, రైస్‌మిల్లర్ల సంఘం నాయకుడు వూరా భాస్కరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T06:32:26+05:30 IST