కౌలురైతులకు బ్యాంకుల్లో రుణాలిప్పించాలి

ABN , First Publish Date - 2021-06-22T06:33:21+05:30 IST

జిల్లాలో కౌలురైతులకు గుర్తింపు కార్డులతోపాటు బ్యాంకుల్లో పంట రుణాలిప్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ, రైతుభరోసా) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు.

కౌలురైతులకు బ్యాంకుల్లో రుణాలిప్పించాలి
సమావేశంలో ప్రసంగిస్తున్న జేసీ దినేష్‌కుమార్‌

జేసీ దినేష్‌కుమార్‌

గుంటూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కౌలురైతులకు గుర్తింపు కార్డులతోపాటు బ్యాంకుల్లో పంట రుణాలిప్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ, రైతుభరోసా) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అమలుచేస్తున్న సున్నా వడ్డీ, పావలా వడ్డీ ఫలాలు కౌలురైతులకు అందటంలే దన్నారు. కలక్టరేట్‌లోని తన చాంబర్‌లో సోమవారం కౌలురైతులకు గుర్తింపుకార్డులు, బ్యాంకుల్లో పంటరుణాలపై వ్యవసాయ, ఉద్యాన, రైతుప్రతినిధులు, బ్యాంకర్లతో సమీక్షించారు. వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ నల్లమోతు శివరామకృష్ణ, ఎల్డీఎం ఈదర రాంబాబు మాట్లాడారు. జేడీఏ విజయభారతి అధ్యక్షత జరిగిన సమావేశంలో ఉద్యానశాఖ డీడీ సుజాత, ఏడీఏ రవికుమార్‌, ఏవో సుజాత తదితరులు పాల్గొన్నారు.  

ఈ-క్రాప్‌లో నమోదైతేనే రైతులకు పరిహారం

 ఈ- క్రాప్‌లో నమోదైతనే రైతులకు పరిహారం వస్తుందని వ్యవసాయశాఖ జేడీ విజయభారతి తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఖరీఫ్‌ నుంచి అన్నిరకాల పథకాలకు ఈ-క్రాప్‌ నమోదును అనుసంధానం చేసిందన్నారు. గుంటూరు మండల కార్యాలయం కృషిభవన్‌లో సోమవారం పంటల బీమాపై వివిధ ప్రభుత్వశాఖలు, బ్యాంకర్లు, రైతు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ నల్లమోతు శివరామకృష్ణ, ఎల్డీఎం ఈదర రాంబాబు, ఉద్యాన శాఖ డీడీ సుజాత, ఏడీ రాజాకృష్ణారెడ్డి, కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ గంగాదేవి, ఏడీఏ రవికుమార్‌, ఏవోలు సుజాత, సుబ్రహ్మణ్యం, పలువురు రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T06:33:21+05:30 IST