జేసీ సీసీల బదిలీ

ABN , First Publish Date - 2021-03-06T05:13:44+05:30 IST

జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ ప్రభాకర్‌రెడ్డి సీసీలు, అటెండర్లపై అంగన్‌వాడీ హెల్పర్‌ చేసిన ఆరోపణలపై ఎట్టకేలకు జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు.

జేసీ సీసీల బదిలీ

నలుగురు ఆఫీసు సబార్డినేట్లకూ స్థాన చలనం

అంగన్‌వాడీ హెల్పర్‌ ఆరోపణలే కారణం!


నెల్లూరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ ప్రభాకర్‌రెడ్డి సీసీలు, అటెండర్లపై అంగన్‌వాడీ హెల్పర్‌ చేసిన ఆరోపణలపై ఎట్టకేలకు జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఇద్దరు సీసీలు, నలుగురు ఆఫీసు సబార్డినేట్లను జాయింట్‌ కలెక్టర్‌ వద్ద నుంచి బదిలీ చేస్తూ కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు నిర్ణయం తీసుకున్నారు. వారందరినీ నెల్లూరు నగరంతో సంబంధం లేకుండా దూర ప్రాంతాలకు బదిలీ చేయడం గమనార్హం. సీసీ రామారావును వరికుంటపాడు మండలం కాకులవారిపాలలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు. మరో సీసీ శ్రీకాంత్‌ను కొండాపురం మండలం చింతలదేవిలోని పశుగణాభివృద్ధి సంస్థకు బదిలీ చేశారు. ఆఫీసు సబార్డినేట్లలో మాబాషాను సీతారామపురం ఎంపీడీవో కార్యాలయానికి, దయాకర్‌ను నాయుడుపేటలోని డీటీడీసీకి, స్వరూప్‌ను ఉదయగిరిలోని బీసీ సంక్షేమ హాస్టల్‌కు, సాల్మాన్‌ను వింజమూరులోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-03-06T05:13:44+05:30 IST