నెఫ్రాలజీ ఔషధాల్లోకి జేబీ కెమికల్స్
ABN , First Publish Date - 2021-05-07T06:31:54+05:30 IST
జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ మూత్రపిండాల వ్యాధుల విభాగంలోకి అడుగుపెట్టింది. ‘రెనోవా’ పేరు తో కొత్త విభాగాన్ని ప్రారంభించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ మూత్రపిండాల వ్యాధుల విభాగంలోకి అడుగుపెట్టింది. ‘రెనోవా’ పేరు తో కొత్త విభాగాన్ని ప్రారంభించింది. మూత్రపిండాల రోగుల కోసం ఏడు ఔషధాలను విడుదల చేయనుంది. రక్తపోటు ఔషధాల తయారీలో కంపె నీ ప్రధానంగా కార్యకలాపాలు సాగిస్తోంది.