Abn logo
Aug 6 2021 @ 00:14AM

హాకీ విజేతలకు నక్కపల్లిలో జేజేలు

నక్కపల్లి హాకీ క్రీడాకారుల సంబరాలు

నక్కపల్లి, ఆగస్టు 5 : ఒలింపిక్స్‌లోని పురుషుల హాకీలో సుదీర్ఘకాలం తరువాత భారత హాకీ జట్టు అనూహ్య విజయం సాధించడంతో నక్కపల్లి బలిరెడ్డి సత్యవతి హాకీ క్లబ్‌ ఆధ్వర్యంలో క్రీడాకారులు గురువారం సంబరాలు జరుపుకున్నారు. ఇక్కడి హైస్కూల్‌ మైదానంలో హాకీ క్లబ్‌ వ్యవస్థాపకులు బలిరెడ్డి సూరిబాబు, కార్యదర్శి కొల్నాటి తాతాజీ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. డీఎస్‌డీవో నగిరెడ్డి సూర్యారావు, చిన్న అప్పారావు, రంజిత్‌, ముద్దా శ్రీను, కొల్నాటి నానాజీ, శివాజీ తదితరులు పాల్గొన్నారు.