జయశంకర్‌ సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2020-08-07T06:31:20+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ప్రొ ఫెసర్‌ జయశంకర్‌ చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణం, శాసనసభ

జయశంకర్‌ సేవలు మరువలేనివి

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 


నిజామాబాద్‌ అర్బన్‌, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ప్రొ ఫెసర్‌ జయశంకర్‌ చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం జయశంకర్‌ జయంతి సందర్భంగా ఆయన హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్‌ సార్‌ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. 


ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతికి సంతాపం 

దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణం పట్ల శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం వ్యక్తిగతంగా కలిచివేసిందన్నారు. ఉ మ్మడి మెదక్‌ జిల్లాలోని దొమ్మాట్ల, దుబ్బాక నియోజకవర్గాల నుంచి ఎ మ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి నిరాడంబరుడని అన్నారు. ప్రజాజీవి తంలో ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. జర్నలిస్టుగా తన ప్ర స్థానాన్ని ప్రారంభించిన రామలింగారెడ్డి కేసీఆర్‌ నెలకొల్పిన  టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఉన్నారన్నారు.


తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పో షించిన ఆయన మరణం తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చే కూరాలన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదే విధంగా దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతి పార్టీకి, దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని బోధన్‌ శాసనసభ్యుడు షకీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టుగా ప నిచేసిన ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభి వృద్ధి బాటలో నడిపించారని అన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగా ఢ సానుభూతిని తెలియజేశారు.

Updated Date - 2020-08-07T06:31:20+05:30 IST